దేవాలయవిశేషాలు


దేవాలయ విశేషాలు :తూర్పు ముఖముగా ఉన్న ఈ దేవాలయమునకు ఎదురుగా చాలాకాలం నాటి పెద్ద మద్దిచెట్టు కలదు.దాని మొదలు భాగము పలు దేవతల ఆకారాలను గుర్తు చేస్తాయి.దీనిచెక్కపోడితో ఎముకల సంబంధిత వ్యాధులకు చికిత్స చేస్తారు.ఈ మద్దిచెట్టు యొక్క పడమటి కొమ్ములో మధ్య కంటి ఆకారము గల రంధ్రమున్నది.అట్టి దానినే  వెతికితెచ్చి ధ్వజస్తంభంగా    పాతడం విశేషము.ఈ చెట్టుకు ఈశాన్యముగా ఒకపాత దిగుడుబావి రాతికట్టడములోనున్నది.ఆ కట్టడములపై స్త్రీలు కుండలతో నీరు తీసుకునిపోవుట,ఋషులు తపస్సు చేయుట ఏనుగులు తొండములతో చెట్లను విరచుట మొదలగు శిల్పాలు రమణీయంగా ఉన్నాయి.ముఖమంటపములో గోడలపై వర్ణచిత్రములు కలవు.దక్షిణ భాగములోశ్రీసీతారామ లక్ష్మహనుమంతవిగ్రహాలు అందంగా చెక్కబడినాయి.కాళీయమర్దన ఘట్టాన్నిగుర్తుకుతెచ్చేచిత్రాలుకడురమణీయంగాఉన్నవి.ఇంకా.ఆంజనేయుడు,కృష్ణుడు,గరుత్మంతుడు,మున్నగు చిత్రాలుకూడా కలవు.ద్వారబంధముపై గజలక్ష్మి యున్నది .ఇరుపక్కల ఎత్తైన వేదికలు కలవు.వాటిపై జయవిజయులను ద్వారపాలకులుగా తీర్చిన నాలుగు అడుగుల విగ్రహాలు కలవు.గర్భగుడికి ముందున్న మంటపములో ద్వాదశాల్వారుల విగ్రహాలు కలవు.దక్షినదిశ లో సామానుల గదిపైన ఉండే గోపురాన్ని చూస్తే ఒకప్పటి ఉడయవర్ల సన్నిధి అనిపిస్తుంది.నాలుగుస్తంభాల మంటపములో స్తంభములపై నాట్య భంగిమలు మునుల యాత్రల చిహ్నాలు కలవు.ఈ దేవాలయములోపంచార్తినుండి 108వరకు ఏకోత్తరవృద్ది కల దీపహారతి చాలా ప్రశస్తి గాంచినది. శాస్త్రోక్తమైన అభిషేకపాత్రలు కలవు.గర్భగుడిలో ఉద్భవమూర్తిగా రంగనాథస్వామి వారున్నారు. స్వామివారికి ఇరువైపులా శ్రీ అలివేలుమంగమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లు ఉన్నారు.వడగలై సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ తిరునామధారణజరుగుతోంది.ఆలయానికి ఆగ్నేయములో యజ్ఞశాల కలదు